కరోనా టెస్టు చేయించుకున్న నటి ప్రణీత... వీడియో ఇదిగో!

03-12-2020 Thu 16:48
  • ఇప్పటికి అనేకసార్లు టెస్టులు చేయించుకున్నట్టు ప్రణీత వెల్లడి
  • ప్రతి టూర్ కు ముందు, తిరిగొచ్చాక టెస్టులు తప్పనిసరి అని వివరణ
  • తొలిసారి చాలా ఇబ్బందికి గురయ్యానన్న ప్రణీత
Pranitha shares corona testing video

దక్షిణాది స్టార్ హీరోయిన్ ప్రణీత కరోనా పట్ల ఎంతో అప్రమత్తంగా ఉంటున్నానని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. గత కొన్నినెలలుగా తాను ఎన్నోసార్లు కరోనా పరీక్షలు చేయించుకున్నానని వెల్లడించారు. ప్రతి పర్యటనకు ముందు, తిరిగొచ్చాక తప్పనిసరిగా టెస్టు చేయించుకుంటున్నానని తెలిపారు. అయితే, తొలిసారి కరోనా టెస్టు చేయించుకునేటప్పుడు తన స్పందన ఎలా ఉందో వివరించారు. స్వాబ్ శాంపిల్స్ తీసుకునే సమయంలో అసౌకర్యానికి గురైనట్టు వెల్లడించారు.