మహాబలేశ్వరంలో 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ సందడి

03-12-2020 Thu 16:17
  • మహాబలేశ్వరంలో లఘు షెడ్యూల్ ప్లాన్ చేసిన జక్కన్న
  • కొన్ని సన్నివేశాల చిత్రీకరణ
  • షూటింగ్ లో పాల్గొంటున్న ఎన్టీఆర్, చరణ్
RRR team goes to Mahabaleswar for a very short schedule

కరోనా లాక్ డౌన్ ఆంక్షలు సడలించడంతో టాలీవుడ్ సినీ షూటింగులు ఊపందుకున్నాయి. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం కూడా మళ్లీ సెట్స్ పైకి వెళ్లింది. ఈ చిత్రం కోసం ఓ లఘు షెడ్యూల్ ను మహారాష్ట్రంలోని మహాబలేశ్వరం వద్ద ప్లాన్ చేశారు.

ఇక్కడి ప్రకృతి అందాల మధ్య కొన్ని సన్నివేశాలను దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. మూవింగ్ క్రేన్ షాట్లు, డ్రోన్ షాట్లు తీసినట్టు తెలుస్తోంది. కాగా, మహాబలేశ్వరం షెడ్యూల్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా పాల్గొంటున్నారు. దీనిపై ఆర్ఆర్ఆర్ చిత్రబృందం ట్విట్టర్ లో వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా పంచుకుంది.

డీవీవీ ఎంటర్టయిన్ మెంట్ పతాకంపై వస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలు కాగా, అలియా భట్, ఒలీవియా మోరిస్ కథానాయికలు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ కీలకపాత్ర పోషిస్తున్నారు.