రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న పవన్ కల్యాణ్... స్వాగతం పలికిన ముఖ్యనేతలు

03-12-2020 Thu 15:48
  • చిత్తూరు, నెల్లూరు జిల్లాల పర్యటనకు వచ్చిన పవన్
  • ఈ సాయంత్రం తిరుపతిలో మీడియా సమావేశం
  • అనంతరం కార్యకర్తలతో భేటీ
Pawan Kalyan arrives Renigunta airport

నివర్ తుపాను కారణంగా దెబ్బతిన్న జిల్లాల్లో పర్యటిస్తున్న జనసేనాని పవన్ కల్యాణ్ కొద్దిసేపటి కిందట రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడ ఆయనకు జనసేన పార్టీ ముఖ్యనేతలు స్వాగతం పలికారు. పవన్ డిసెంబరు 3, 4, 5 తేదీల్లో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పర్యటించనున్నారు.

ఈ నేపథ్యంలో రేణిగుంట వచ్చిన ఆయన కరకంబాడి మీదుగా తిరుపతి బయల్దేరారు. తిరుపతిలో సాయంత్రం 4 గంటలకు పవన్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం 5 గంటలకు జనసేన కార్యకర్తల భేటీలో పొల్గొంటారు. ఇటీవల నివర్ తుపానుతో ఏపీలోని అత్యధిక జిల్లాల్లో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల కష్టాలను తెలుసుకోవాలని పవన్ రంగంలోకి దిగారు.