నటి వరలక్ష్మి శరత్ కుమార్ సోషల్ మీడియా అకౌంట్లపై హ్యాకర్ల ప్రతాపం

03-12-2020 Thu 14:17
  • హ్యాకింగుకి గురైన ఇన్ స్టా, ట్విట్టర్ అకౌంట్లు  
  • నిపుణులతో సంప్రదిస్తున్నానని వెల్లడి
  • ఏవైనా పోస్టులు వస్తే జాగ్రత్తగా ఉండాలని ఫ్యాన్స్ కు సూచన
Actress Varalaxmi Sarathkumar social media accounts hacked

ప్రముఖ దక్షిణాది నటి వరలక్ష్మి శరత్ కుమార్ సోషల్ మీడియా అకౌంట్లు హ్యాకింగ్ కు గురయ్యాయి. ఈ విషయాన్ని వరలక్ష్మి ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. గత రాత్రి తన ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ అకౌంట్లను హ్యాక్ చేశారని, వాటిలో తాను ప్రవేశించలేకపోతున్నానని వివరించారు. తన ఖాతాలను పునరుద్ధరించేందుకు ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ బృందాలతో సంప్రదింపులు జరుపుతున్నానని తెలిపారు.

తన సోషల్ మీడియా అకౌంట్ల పునరుద్ధరణకు కొన్నిరోజులు పట్టే అవకాశముందని, అప్పటివరకు తన పేరిట ఇన్ స్టాగ్రామ్ లో కానీ, ట్విట్టర్ లో కానీ ఏవైనా పోస్టులు వస్తే వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ అభిమానులను అప్రమత్తం చేశారు. తన అకౌంట్లు పునరుద్ధరణకు గురైన తర్వాత తానే అభిమాలకు ఆ విషయం తెలియజేస్తానని వరలక్ష్మి తెలిపారు.