Vijay Devarakonda: "అదిరింది అన్నో"...అల్లు అర్జున్ పై విజయ్ దేవరకొండ వ్యాఖ్యలు

Vijay Devarakonda comments on Allu Arjun who wore Rowdy brand apparel
  • బన్నీకి రౌడీ బ్రాండ్ దుస్తులు పంపిన విజయ్ దేవరకొండ
  • డ్రెస్సు ధరించి ఫొటోలు పోస్టు చేసిన బన్నీ
  • సోషల్ మీడియాలో సందడి చేస్తున్న పిక్స్
టాలీవుడ్ హీరోలు అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ మధ్య సాన్నిహిత్యం ఉంది. గతంలో విజయ్ సినిమాల ఫంక్షన్లకు అల్లు అర్జున్ హాజరైన సందర్భాలున్నాయి. తాజాగా, విజయ్ దేవరకొండ తన రౌడీ బ్రాండ్ నుంచి కొన్ని ఎంపిక చేసిన దుస్తులను అల్లు అర్జున్ కు పంపాడు. ట్రెండీగా ఉన్న ఆ డ్రెస్సులను ధరించిన బన్నీ సోషల్ మీడియాలో ఫొటోలు పంచుకున్నాడు. ఈ పిక్స్ సోషల్ మీడియాలో బాగా సందడి చేస్తున్నాయి.

ఆ ఫొటోలను చూసి విజయ్ దేవరకొండ తన ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయాడు. "స్టన్నింగ్ అన్నో" అంటూ ట్విట్టర్ లో వ్యాఖ్యానించాడు. గత సెప్టెంబరులోనూ విజయ్ దేవరకొండ ఇలాగే బన్నీకి లేటెస్ట్ ఫ్యాషన్ డ్రెస్సులు పంపాడు. ప్రత్యేకంగా రూపొందించిన టీషర్టు, ట్రాక్ ప్యాంట్స్ తో పాటు డిజైనర్ మాస్కులు వాటిలో ఉన్నాయి.
Vijay Devarakonda
Allu Arjun
Rowdy Brand
Apparel

More Telugu News