చంద్రబాబు ఫేక్ ప్రతిపక్ష నేత: కొడాలి నాని తీవ్ర విమర్శలు
- చంద్రబాబు ఒక్క రూపాయి పెన్షన్ కూడా పెంచలేదు
- బాబుకు పారిపోవడం అలవాటు
- తెలుగుదేశం ఒక ఫేక్ పార్టీ
చంద్రబాబు తన జీవితంలో ఎన్నోసార్లు పారిపోయారని... 1983లో ఓడిపోగానే కాంగ్రెస్ ను వదలి పారిపోయారని, అప్పుడు చంద్రగిరి నుంచి కుప్పం పారిపోయారని కొడాలి నాని విమర్శించారు. ఓటుకు నోటు కేసు రాగానే హైదరాబాద్ వదిలి పారిపోయారని, కరోనా రాగానే కాల్వగట్టు వదిలి హైదరాబాదుకు పారిపోయారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఫేక్ ప్రతిపక్ష నేత అని, టీడీపీ ఫేక్ పార్టీ అని అన్నారు. వేరే పార్టీతో పొత్తు పెట్టుకోకుండా చంద్రబాబు ఎన్నికల్లో పోటీ చేయలేరని దెప్పిపొడిచారు.