కొత్త సంవత్సరంలో కొత్త పార్టీ పెడుతున్నాను: రజనీకాంత్ ప్రకటన

03-12-2020 Thu 12:54
  • ఇటీవల తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడిన రజనీ
  • త్వరలో ప్రకటన చేస్తానని ఇటీవలే వెల్లడి
  • చెప్పినట్లే ప్రకటన చేసిన రజనీ
  • ఈ నెల 31న పార్టీ పేరు, కార్యాచరణ ప్రకటన
 will announce about political entry

ఇటీవలే ఆర్‌ఎంఎం (రజనీ మక్కల్ మండ్రం) సభ్యులతో సినీనటుడు రజనీకాంత్  సమావేశమై చర్చించిన విషయం విదితమే. చెన్నైలోని రాఘవేంద్ర ఫంక్షన్ హాల్‌లో కొనసాగిన ఆ సమావేశం ముగిసిన అనంతరం తన నివాసం వద్ద మాట్లాడుతూ రాజకీయ రంగ ప్రవేశంపై వీలైనంత త్వరగా నిర్ణయాన్ని ప్రకటిస్తానని రజనీ చెప్పారు. చెప్పినట్లే ఆయన ఈ రోజు కీలక ప్రకటన చేశారు. కొత్త సంవత్సరంలో కొత్త పార్టీ పెడతానని స్పష్టం చేశారు.

ఈ నెల 31న పార్టీని ప్రకటించనున్నట్లు ట్వీట్ చేశారు. ఆ రోజునే తాను అన్ని వివరాలను ప్రకటిస్తానని తెలిపారు. ఆయన చేసిన ప్రకటనతో అభిమానులు సంబరాలు ప్రారంభించారు. పలు జిల్లాల్లో మిఠాయిలు పంచుకుంటున్నారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని కొన్ని ఏళ్లుగా జరుగుతోన్న ప్రచారానికి ఒక్క ట్వీట్ తో ఆయన తెరదించారు. ఆయన చేసిన ప్రకటనతో తమిళనాడులో రాజకీయ సమీకరణాలు మారతాయని పరిశీలకుల అంచనా.