నేటి సాయంత్రం పవన్ కల్యాణ్ మీడియా సమావేశం!

03-12-2020 Thu 11:46
  • నిన్న రైతులతో మాట్లాడిన పవన్ 
  • సాయంత్రం 4 గంటలకు తిరుపతిలో మీడియా సమావేశం
  • అనంతరం విహాస్ హోటల్ లో పార్టీ నేతలతో భేటీ
pawan to speaks with media

నివర్ తుపాను ధాటికి ఏపీ రైతులు తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. నిన్న ఆయన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటించి, రైతులు నష్టపోయిన పంటలను పరిశీలించారు. మరోపక్క, ఈ పర్యటనలో భాగంగా ఆయన జనసేన నేతలు, కార్యకర్తలతోనూ సమావేశమై పార్టీ బలోపేతంపై చర్చించనున్నారు.

ఈ క్రమంలో ఈ రోజు మధ్యాహ్నం ఆయన 3 గంటలకు రేణిగుంట విమానాశ్రయంకు చేరుకుంటారని జనసేన పార్టీ తెలిపింది. సాయంత్రం 4 గంటలకు తిరుపతి లోని విహాస్ హోటల్ లో మీడియా ప్రతినిధులతో సమావేశం అవుతారని పేర్కొంది. సాయంత్రం 5 గంటలకు విహాస్ హోటల్ లో చిత్తూరు జిల్లా జనసేన పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అవుతారని వివరించింది. రేపు, ఎల్లుండి కూడా పవన్ కల్యాణ్  చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పర్యటిస్తారు.