భార్య చెప్పిన స్టోరీకి ఫిదా అయిన దిల్ రాజు... అతి త్వరలోనే సెట్స్ పైకి!

03-12-2020 Thu 11:40
  • ఓటీటీకి అనుగుణంగా కథల తయారీ
  • పక్కా స్రిప్ట్ కోసం బృందం ఏర్పాటు
  • చిన్న సినిమాలపై కన్నేసిన దిల్ రాజు
Dil Raju Impressed by His Wifes Story Line

కరోనా కారణంగా తీవ్రంగా నష్టపోయిన సినీ పరిశ్రమ ఇప్పుడిప్పుడే ఓటీటీకి అనుగుణంగా కథలను తయారు చేసుకుంటూ, తక్కువ ఖర్చుతో వినూత్న ఆలోచనలతో సినిమాలు తీసి హిట్లు కొడుతున్న వేళ, ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా ఓటీటీ దిశగా అడుగులు వేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో తగిన కథల కోసం వెతుకుతుంటే, ఆయన భార్య తేజస్విని చెప్పిన స్టోరీ విని ఫిదా అయ్యారట.

తేజస్విని స్వయంగా ఓ కథను తయారు చేసి, మరిన్ని కథలను కూడా సిద్ధం చేస్తుండగా, వాటికి మరిన్ని మెరుగులు దిద్ది, పక్కాగా స్రిప్ట్ లను తయారు చేయించాలన్న ఉద్దేశంతో రచయితలతో కూడిన బృందాన్ని కూడా ఆయన ఏర్పాటు చేశారని, తేజస్వినికి వారు సాయపడుతూ, కథలకు పదును పెడుతున్నారని టాలీవుడ్ వర్గాల సమాచారం.