ఇండియాలో అత్యంత విశ్వసనీయ బ్రాండ్ల జాబితాను విడుదల చేసిన టీఆర్ఏ రీసెర్చ్!

03-12-2020 Thu 08:48
  • తొలి స్థానంలో డెల్, ఆపై షావోమీ, శాంసంగ్
  • ఆ తరువాత యాపిల్, ఎల్జీ
  • వాహన విభాగంలో తొలి స్థానంలో మారుతి సుజుకి
TRA Research Releases Indias Most Trusted Brands List

ఇండియాలో ప్రజలు అత్యధికంగా నమ్ముతున్న బ్రాండ్ల జాబితాను టీఆర్ఏ రీసెర్చ్ తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో వరుసగా రెండో సంవత్సరం యూఎస్ కంప్యూటర్ బ్రాండ్ 'డెల్' తొలి స్థానంలో నిలవడం గమనార్హం. ఆపై రెండో స్థానంలో మొబైల్ బ్రాండ్ షావోమి, శాంసంగ్ మొబైల్ మూడో స్థానంలో, యాపిల్ ఐ ఫోన్ నాలుగో స్థానంలో నిచాయి. ఆ తరువాత ఐదో స్థానంలో ఎల్జీ టెలివిజన్లు నిలిచాయి.

కేవలం వాహన విభాగాన్ని పరిశీలిస్తే, మారుతి సుజుకి అగ్రస్థానంలో నిలిచింది. ఈ సంస్థ నమ్మకమైన బ్రాండ్ల మొత్తం జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉండటం గమనార్హం. దేశవ్యాప్తంగా 16 నగరాల్లో 323 కేటగిరీల్లో 8 వేల బ్రాండ్లను పరిగణనలోకి తీసుకుని ఈ సర్వేను నిర్వహించామని టీఆర్ఏ రీసెర్చ్ సీఈఓ ఎన్ చంద్రమౌళి వెల్లడించారు. గతంలో ఎన్నో కేటగిరీల్లో తొలి స్థానాల్లో ఉన్న సంస్థలు, కరోనా ప్రభావంతో తమ ఆధిపత్యాన్ని కోల్పోయాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.