Aksai Chin: అక్సాయ్ చిన్ ను చైనా మ్యాప్ లో చూపిన వికీపీడియా... డిలీట్ చేయాలని భారత్ హెచ్చరిక!

  • నవంబర్ 27 తేదీతో వికీపీడియాకు నోటీసులు
  • మ్యాప్ తొలగించకుంటే ఐటీ చట్టం కింద చర్యలు
  • హెచ్చరించిన కేంద్ర కార్యదర్శి అజయ్ స్వాహ్నీ
Wikipedia Shows Aksai Chin is in China and India Warning

ఇండియాలో భాగంగా ఉన్న అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని చైనాలో ఉన్నట్టుగా చూపించిన వికీపీడియాపై భారత ప్రభుత్వం మండిపడింది. వెంటనే ఆ మ్యాప్ ను తొలగించాలని హెచ్చరించింది. ఈ మేరకు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్ స్వాహ్నీ, నవంబర్ 27వ తేదీతో వికీపీడియాకు నోటీసులు పంపించారు.

 భారత సార్వభౌమాధికారాన్ని, ఇండియా పరిధిలోని ప్రాంతాలను ప్రశ్నిస్తే, చూస్తూ ఊరుకోబోమని తెలిపారు. తక్షణం ఆ మ్యాప్ ను డిలీట్ చేయకుంటే ఐటీ చట్టం సెక్షన్ 59ఏ ప్రకారం వికీపీడియాపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, ఈ విషయంలో వికీపీడియా ఇంకా స్పందించలేదు.

More Telugu News