సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

03-12-2020 Thu 07:19
  • కొత్త హీరోలతో కూడా చేస్తానంటున్న శ్రియ 
  • మరింత ముందుకు వెళ్లిన 'వకీల్ సాబ్'
  • థియేటర్లలో విడుదల అవుతున్న 'షకీలా'  
Shriya says she has no objection to act with new heroes

*  కొత్త హీరోలతో నటించడానికి తనకేమీ అభ్యంతరం లేదంటోంది కథానాయిక శ్రియ. 'ఒక సినిమా ఒప్పుకునే ముందు నా పాత్ర ఏమిటనేదే చూస్తాను. అంతేతప్ప, హీరో ఎవరనేది పట్టించుకోను. కొత్త హీరోలతో నటించకూడదన్న రూల్ కూడా ఏమీ పెట్టుకోలేదు. కథ నచ్చితే ఎవరితో చేయడానికైనా సిద్ధమే' అని చెప్పింది ఈ ముద్దుగుమ్మ.
*  పవన్ కల్యాణ్ కొంత గ్యాప్ తర్వాత నటిస్తున్న 'వకీల్ సాబ్' చిత్రం విడుదల ఇక సంక్రాంతికి లేనట్టేనని తెలుస్తోంది. ఇంకా మరికొంత షూటింగ్ మిగిలివుండడంతో వచ్చే ఏడాది ఉగాదికి రిలీజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారట. దీనికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు.
*  నిన్నటితరం శృంగారతార షకీలా జీవితకథ ఆధారంగా రూపొందిన 'షకీలా' చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇంద్రజిత్ లంకేశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఈ నెల 25న దీనిని రిలీజ్ చేస్తారు. ఇందులో రిచా చద్దా టైటిల్ రోల్ పోషించింది. ముందుగా హిందీలో రిలీజ్ చేసిన అనంతరం తెలుగు, మలయాళం, కన్నడ, తమిళ భాషల్లో విడుదల చేస్తారు.