యూనిట్ సభ్యులకు కరోనా.. ఆగిన ‘పుష్ప’ సినిమా చిత్రీకరణ

03-12-2020 Thu 06:30
  • ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే సినిమా
  • తూర్పు మన్యంలో నిరవధికంగా షూటింగ్
  • తాత్కాలికంగా చిత్రీకరణ నిలిపివేత
Allu Arjun pushpa movie shooting halted

అల్లు అర్జున్‌, సుకుమార్ క్రేజీ కాంబోలో తెరకెక్కుతున్న ‘పుష్ప’ సినిమా షూటింగ్‌ను నిన్న నిలిపివేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా షూటింగ్ తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం తూర్పు మన్యంలో నిరవధికంగా సాగుతోంది. ఇటీవల యూనిట్ సభ్యుడు ఒకరు మృతి చెందారు. ఆ తర్వాత నిర్వహించిన కొవిడ్ పరీక్షల్లో పలువురికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది.

దీంతో సినిమా చిత్రీకరణను తాత్కాలికంగా నిలిపివేసినట్టు సమాచారం. నిజానికి సినిమా షూటింగ్ కోసం కేరళ వెళ్లాలని లాక్‌డౌన్‌కు ముందు నిర్ణయించారు. అయితే, కరోనా కారణంగా చిత్రీకరణ నిలిచిపోయింది. ఇటీవల మళ్లీ అక్కడ కేసులు వెలుగు చూస్తుండడంతో కేరళకు బదులుగా తూర్పు మన్యాన్ని ఎంచుకున్నారు.