ఏపీలో కొత్తగా 663 కరోనా కేసులు.. పూర్తి వివరాలు!

02-12-2020 Wed 20:30
  • గత 24 గంటల్లో ఏడు మరణాలు 
  • 8,69,412కి చేరిన మొత్తం కేసుల సంఖ్య
  • ప్రస్తుతం ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య 6,924
Corona deaths in AP crosses 7K

ఏపీలో కరోనా ఉద్ధృతి కొంత తగ్గినప్పటికీ ప్రతిరోజు వందల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 663 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో ఏడుగురు కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలోని కరోనా మరణాల సంఖ్య 7 వేలను దాటింది. ఇప్పటి వరకు మొత్తం 7,003 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 8,69,412కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,924 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 1,159 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు.