అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'లో మరో హీరోయిన్!

02-12-2020 Wed 17:48
  • అఖిల్ తాజా చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' 
  • అఖిల్ సరసన ప్రధాన నాయికగా పూజ హెగ్డే
  • మరో కథానాయికగా నేహా శెట్టి ఎంపిక
  • హైదరాబాదులో జరుగుతున్న షూటింగ్
Another heroine in Most Eligible Bachelor

నాగార్జున మరో వారసుడుగా చిత్ర రంగ ప్రవేశం చేసిన అఖిల్ హీరోగా ఇంతవరకు నాలుగు సినిమాలలో నటించాడు. అయితే సరైన హిట్ మాత్రం పడలేదు. ఈ క్రమంలో తన ఐదో చిత్రాన్ని బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో చేస్తున్నాడు. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' పేరుతో ఇది తెరకెక్కుతోంది.

ఇందులో టాలీవుడ్ హాట్ స్టార్ పూజ హెగ్డే కథానాయికగా నటిస్తోంది. అయితే, ఆమె కాకుండా మరో హీరోయిన్ పాత్ర కూడా ఈ సినిమాలో ఉందట. ఈ పాత్రలో నేహా శెట్టి నటిస్తున్నట్టు తాజా సమాచారం. గతంలో ఆకాశ్ పూరి హీరోగా నటించిన 'మెహబూబా' సినిమాలో నేహా కథానాయికగా నటించింది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులో జరుగుతోంది. త్వరలోనే ఇది పూర్తవుతుంది. వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించి చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, వాసువర్మ కలసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.