రవితేజ సినిమాలో విలన్ గా ప్రముఖ హీరో!

02-12-2020 Wed 16:04
  • రవితేజ హీరోగా రూపొందుతున్న 'ఖిలాడి'  
  • ప్రధాన విలన్ గా యాక్షన్ కింగ్ అర్జున్
  • హీరోయిన్లుగా అనూ ఇమ్మానుయేల్, మీనాక్షి చౌదరి
  • రెండు పాత్రలు పోషిస్తున్న హీరో రవితేజ రవితేజ   
Arjun turns villain for Raviteja

యాక్షన్ కింగ్ గా పేరుతెచ్చుకున్న సీనియర్ నటుడు అర్జున్ గురించి దక్షిణాది సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సుదీర్ఘమైన తన కెరీర్లో హీరోగా ఎన్నో విభిన్న పాత్రలను ఆయన పోషించారు. విభిన్నతరహా అభినయంతో తెలుగు, కన్నడ, తమిళ సినిమాలలో తనదైన ముద్ర వేశారు. ఇప్పటికీ ఓపక్క హీరోగా నటిస్తూ.. మరోపక్క ఇతర హీరోల సినిమాలలో కీలక పాత్రలు పోషిస్తూ తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు.

ఈ క్రమంలో తాజాగా అర్జున్ ఓ తెలుగు సినిమాలో విలన్ గా నటించడానికి ఓకే చెప్పారు. రవితేజ హీరోగా రమేశ్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడి' పేరిట తాజాగా ఓ చిత్రం రూపొందుతోంది. ఆమధ్య ఈ చిత్రం షూటింగ్ హైదరాబాదులో మొదలైంది. ఇందులో అర్జున్ ప్రధాన విలన్ గా కీలక పాత్రను పోషిస్తున్నారట. ఇప్పటికే ఆయన షూటింగులో కూడా జాయిన్ అయినట్టు సమాచారం.

ఈ సినిమాలో రవితేజ సరసన అనూ ఇమ్మానుయేల్, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు చెబుతున్నారు.