బండి సంజయ్ కు ఫోన్ చేసి ప్రశంసించిన మోదీ

02-12-2020 Wed 15:42
  • సంజయ్ తో 10 నిమిషాలు మాట్లాడిన మోదీ
  • ఎన్నికల్లో అద్భుత పోరాటం చేశారని కితాబు
  • ఇదే ఉత్సాహంతో ముందుకు సాగాలని సూచన 
Modi telephones Bandi Sanjay

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సరళిపై  సంజయ్ తో చర్చించారు. దాదాపు 10 నిమిషాల పాటు మాట్లాడిన మోదీ సంజయ్ ను ప్రశంసించారు. దుబ్బాక ఎన్నిక, గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ నేతలు, కార్యకర్తలు అద్భుతంగా పోరాటం చేశారని ఈ సందర్భంగా మోదీ ప్రశంసించారు.

ఇదే సమయంలో బీజేపీ నేతలు, కార్యకర్తలపై జరిగిన దాడులు, దౌర్జన్యాలపై అడిగి తెలుసుకున్నారు. పార్టీని విజయపథంలో నడిపించేందుకు క్యాడర్ చేసిన కృషిని అభినందించారు. ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చినా ధైర్యంగా ముందుకు సాగాలని, నూతన ఉత్సాహంతో పని చేయాలని చెప్పారు. అన్ని విధాలుగా తాము అండగా ఉంటామని అన్నారు.