ఫ్లై ఓవర్‌పై ఓ వ్యక్తిపై కత్తితో దాడిచేసిన దుండగుడు.. వీడియో ఇదిగో

02-12-2020 Wed 13:34
  • ముంబైలోని కుర్లా ప్రాంతంలో ఘటన
  • దుండగుడి బారి నుంచి తప్పించుకున్న పాదచారి
  • పారిపోయిన దుండగుడు
Man survives knife attack

ఓ పాదచారిపై దుండగుడు కత్తితో దాడిచేసి కలకలం రేపాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ పాదచారి వెంటనే అప్రమత్తమై తప్పించుకోవడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన ఈ దృశ్యాలు మీడియాకు దొరికాయి.

మహారాష్ట్ర రాజధాని ముంబైలోని కుర్లా ప్రాంతంలో పాదచారుల వంతెనపై ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో మెల్లిగా వెనుకనుంచి ముసుగుతో వచ్చిన ఓ దుండగుడు అతనిపై కత్తితో దాడిచేశాడు. దీంతో గాయాలతోనే ఆ పాదచారి అతడిని ఎదుర్కోవడంతో ఆ దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో ఆ పాదచారి ప్రాణాలతో బయటపడ్డాడు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. అతడిని చంపాలన్న ఉద్దేశంతోనే దుండగుడు ఈ దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.