Urmila Matondkar: శివసేనలో చేరిన తరువాత కంగనపై తొలిసారి స్పందించిన ఊర్మిళ!

Urmila Latest Comments on Kangana After Joining Siva Sena
  • కంగన గురించి మాట్లాడేందుకు అభిమానిని కాను
  • ఆమెకు ప్రాముఖ్యత ఇవ్వాలని భావించడం లేదు
  • తానెన్నడూ ఆమెను విమర్శించ లేదన్న ఊర్మిళ
నటి ఊర్మిళ మతోండ్కర్, నిన్న శివసేన పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలోని శాసన మండలిలో 12 నామినేటెడ్ పోస్టుల్లో ఆమె పేరును కూడా చేర్చిన తరువాత, ఆమె పార్టీలో చేరింది. ఆపై మీడియాతో మాట్లాడిన ఊర్మిళ, తనను 'సాఫ్ట్ పోర్న్ స్టార్' అని గతంలో అభివర్ణించిన మరో నటి కంగన రనౌత్ వ్యాఖ్యలపై స్పందిస్తూ చురకలంటించారు. తానేమీ కంగన గురించి మాట్లాడేందుకు ఆమె అభిమానిని కాదన్నారు.

"కంగన గురించి ఇప్పటికే చాలా మాట్లాడారు. ఆమెకు అంత ప్రాముఖ్యత ఇవ్వాలని నేనేమీ భావించడం లేదు. ప్రతి ఒక్కరికీ విమర్శించే హక్కుంటుంది. ఆమెకూ ఉంది. నేను నేడు ఒకటే చెప్పాలని అనుకుంటున్నాను. నేను ఆమె గురించి నా ఏ ఇంటర్వ్యూలోనూ స్పందించలేదు" అని ఊర్మిళ వ్యాఖ్యానించారు.

కాగా, 2019లో కాంగ్రెస్ తరఫున లోక్ సభకు పోటీ చేసి ఓటమిపాలైన ఊర్మిళ, ఆపై ఉద్ధవ్ థాకరే అమలు చేస్తున్న పథకాలు, మహారాష్ట్ర అభివృద్ధిని చూసి  పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. నిన్న ఉద్ధవ్ నివాసమైన మాతోశ్రీలో ఊర్మిళ శివసేన కండువాను కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తాను కాంగ్రెస్ ను వీడి 14 నెలలైందని అన్నారు. చాలామంది ఓ పార్టీని వీడిన గంటల వ్యవధిలోనే మరో పార్టీలో చేరుతారని, తానేమీ అటువంటి పని చేయలేదని అన్నారు.
Urmila Matondkar
Sivasena
Kangana Ranaut

More Telugu News