టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఇండియా... గెలిచి పరువు కాపాడుకునేనా?

02-12-2020 Wed 08:52
  • తొలి రెండు మ్యాచ్ లలో ఓటమి
  • ఇందులో గెలిస్తే పెరగనున్న ఆత్మస్థైర్యం
  • త్వరలోనే టీ-20 సిరీస్
India Won the Toss in Third Oneday

మరికాసేపట్లో ఇండియా, ఆస్ట్రేలియా మధ్య కాన్ బెర్రాలో మూడవ వన్డే ప్రారంభం కానుంది. మూడు మ్యాచ్ ల సిరీస్ లో తొలి రెండు మ్యాచ్ లనూ దారుణంగా కోల్పోయిన భారత జట్టు, ఈ మ్యాచ్ లో గెలిచి, పరువును నిలుపుకోవడంతో పాటు, రానున్న టీ-20 సిరీస్ కు ఆత్మస్థైర్యాన్ని పెంచుకుని వెళ్లాలన్న ఏకైక లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. ఇక, ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, తొలుత బ్యాటింగ్ ను ఎంచుకున్నారు.

జట్ల వివరాలు:
భారత్: శిఖర్ ధావన్, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్ దీప్ యాదవ్, జస్ ప్రీత్ బుమ్రా, టి.నటరాజన్.

ఆస్ట్రేలియా: ఆరోన్ ఫించ్, మార్నస్ లుబుస్ చేంజ్, స్టీవ్ స్మిత్, కామెరాన్ గ్రీన్, మోసెస్ హెన్రిక్స్, అలెక్స్ కారీ, గ్లెన్ మాక్స్ వెల్, ఆస్టన్ అగర్, సీన్ అబాట్, ఆడమ్ జంపా, జోష్ హాజెల్ వుడ్.