Brahmaputra: బ్రహ్మపుత్ర నదిపై భారీ ప్రాజెక్టును నిర్మించాలని భారత్ నిర్ణయం!

  • 60 గిగావాట్ల ప్రాజెక్టును ప్రకటించిన చైనా
  • అరుణాచల్ ఎగువ భాగాన భారత్ ప్రాజెక్టు
  • వెల్లడించిన జల వనరుల శాఖ
India to Build a New Project on Brahmaputra

టిబెట్ పరిధిలో యుర్లుంగ్ త్సంగ్ బో (బ్రహ్మపుత్ర నది)పై 60 గిగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టును నిర్మించనున్నామని చైనా ప్రకటించిన నేపథ్యంలో అప్రమత్తమైన భారత్, అరుణాచల్ ప్రదేశ్ పరిధిలో 10 గిగావాట్ల ప్రాజెక్టును నిర్మించాలని నిర్ణయించింది. ఈ నదిపై చైనా ప్రాజెక్టుల కారణంగా ఇండియాలో అకస్మాత్తుగా వరదలు రావడం, నదిలో నీరు లేని వేళ, పై నుంచి విడుదల చేయక, నీటి కొరత ఏర్పడుతూ ఉండటం తదితరాల నేపథ్యంలోనే, అరుణాచల్ ఎగువ ప్రాంతాన ఈ భారీ డ్యామ్ ను నిర్మించడం ద్వారా చైనా ప్రాజెక్టుల ప్రభావాన్ని తగ్గించాలని నిర్ణయించామని కేంద్ర జల వనరుల శాఖ సీనియర్ అధికారి టీఎస్ మెహ్రా వెల్లడించారు.

ఈ ప్రతిపాదన ప్రస్తుతం పరిశీలనలో ఉందని ఆయన స్పష్టం చేశారు. కాగా, ఇప్పటికే చైనా, ఇండియాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనివున్న నేపథ్యంలో నదీ జలాల వివాదాలు వాటిని మరింతగా పెంచవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, ఈ కొత్త ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే ఇండియాపై చైనా జలాశయాల ప్రభావం తగ్గుతుందని, పైగా నీటిని మనం కూడా నిల్వ చేసుకునే సామర్థ్యం పెరుగుతుందని మెహ్రా వెల్లడించారు.

More Telugu News