Monolith: అమెరికా ఎడారిలో మాయమై... రొమేనియాలో ప్రత్యక్షమైన లోహపు దిమ్మె... ఏమిటీ మిస్టరీ?

  • ఇటీవల ఉటా ఎడారిలో కనిపించిన దిమ్మె
  • కొన్నిరోజుల తర్వాత మాయం
  • రొమేనియా డేసియన్ కోట సమీపంలో కనిపించిన దిమ్మె
 Another monolith creates sensation

కొన్నిరోజుల కిందట అమెరికాలోని ఉటా రెడ్ రాక్ ఎడారిలో కనిపించిన ఓ లోహపు దిమ్మె ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఆ లోహపు దిమ్మె ఉన్నట్టుండి మాయం కావడం కూడా అంతే కలకలం రేపింది. దాన్ని ఎవరు అక్కడ్నించి ఎత్తుకెళ్లారో ఇంతవరకు తెలియలేదు సరికదా... అలాంటిదే ఓ లోహపు దిమ్మె రొమేనియా దేశంలో ప్రత్యక్షం కావడం విస్మయానికి గురిచేస్తోంది. రొమేనియాలోని చారిత్రక పెట్రోడోవా డేసియన్ కోట సమీపంలో ఈ ముక్కోణాకారపు దిమ్మె దర్శనమిచ్చింది. ఇలా ఎవరు చేస్తున్నారు? వాళ్ల ఉద్దేశం ఏంటన్నది ఆసక్తికరంగా మారింది.

అయితే, ఉటా ఎడారిలో కనిపించిన లోహపు దిమ్మెకు, దీనికి స్వల్పంగా తేడాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఉటాలోని దిమ్మె పూర్తిగా స్టెయిన్ లెస్ స్టీల్ లోహంతో తయారైనది కాగా, రొమేనియాలోని దిమ్మెపై చిత్రమైన రాతలు ఉన్నట్టు గుర్తించారు. అసలింతకీ ఈ లోహపు దిమ్మెల వెనుక ఉద్దేశం ఏంటో అర్థంకాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అయితే, ఇలాంటివి గ్రహాంతర వాసుల చర్యలే అయ్యుంటాయని కొందరు భావిస్తున్నారు.

More Telugu News