బంగాళాఖాతంలో 'బురేవి'... తుపానుగా మారిన తీవ్ర వాయుగుండం

01-12-2020 Tue 20:56
  • ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తుపాను
  • రేపు సాయంత్రం ట్రింకోమలీ తీరాన్ని దాటనున్న బురేవి
  • డిసెంబరు 3న మన్నార్ సింధుశాఖలో ప్రవేశం
Deep Depression in Bay Of Bengal intensified into Cyclone Burevi

ఆగ్నేయ బంగాళాఖాతంలో శ్రీలంకకు సమీపంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. ఈ తుపానును బురేవిగా పిలవనున్నారు. ప్రస్తుతం ఈ తుపాను శ్రీలంకలోని ట్రింకోమలీ తీరానికి తూర్పు, ఆగ్నేయ దిశగా 400 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. బురేవి డిసెంబరు 2 సాయంత్రం తర్వాత ట్రింకోమలీ రేవు పట్టణం సమీపంలో తీరం దాటనుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. డిసెంబరు 3 ఉదయం మన్నార్ సింధుశాఖలో ప్రవేశించి దక్షిణ తమిళనాడు తీరాన్ని తాకుతుందని వివరించింది. దీని ప్రభావంతో తమిళనాడు, కేరళ, దక్షిణ కోస్తాంధ్రలో వర్షాలు కురుస్తాయని ఇంతకుముందు ప్రకటించారు.