ఎవరికో కడుపు మండి కోర్టుకు వెళితే మాపై విమర్శలా?: చంద్రబాబు ఆగ్రహం

01-12-2020 Tue 19:35
  • ఇళ్ల స్థలాల పంపిణీ నేపథ్యంలో సీఎం జగన్ ఆరోపణలు
  • చంద్రబాబు అడ్డుపడుతున్నాడన్న సీఎం
  • స్పందించిన చంద్రబాబు
Chandrababu furious comments on CM Jagan

పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అడ్డుపడుతున్నారంటూ సీఎం జగన్ ఆరోపిస్తుండడం తెలిసిందే. దీనిపై చంద్రబాబు స్పందించారు. 'ఇళ్ల స్థలాలు ఇస్తుంటే మేం అడ్డుపడుతున్నట్టు ఆరోపణలు చేస్తున్నారు... ఇళ్ల స్థలాలుగా శ్మశానాలు, ఆవ భూములు, మడ భూములు ఇస్తారా?' అని ప్రశ్నించారు.

 ఎవరికో కడుపు మండి కోర్టుకు వెళితే మాపై విమర్శలు చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల స్థలాల్లో అవినీతిపై విచారణ జరిపించండి అని డిమాండ్ చేశారు. టీడీపీ హయాంలో గ్రామాల్లో 3 సెంట్లు, నగరాల్లో 2 సెంట్లు ఇచ్చామని, ఇప్పుడు సెంట్ భూమి ఇచ్చి మురికివాడలు తయారా చేస్తారా? అని చంద్రబాబు నిలదీశారు. ఏపీని గ్యాంబ్లింగ్ స్టేట్ గా తయారుచేశారని ఆరోపించారు.