చంద్రబాబు మినహా టీడీపీ సభ్యులందరినీ సస్పెండ్ చేసిన స్పీకర్

01-12-2020 Tue 18:30
  • టిడ్కో ఇళ్లపై చర్చ సందర్భంగా గందరగోళం
  • సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన మంత్రి బుగ్గన
  • ఈరోజు సభ ముగిసేంత వరకు సస్పెండ్ చేసిన స్పీకర్
Except Chandrababu all other TDP MLAs suspended from AP assembly

టిడ్కో ఇళ్లపై ఈరోజు ఏపీ అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. ముఖ్యమంత్రి జగన్, టీడీపీ అధినేత చంద్రబాబుల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. స్పీకర్, చంద్రబాబుల మధ్య కూడా విమర్శలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు మినహా ఇతర టీడీపీ సభ్యులందరినీ స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. ఈరోజు సభ ముగిసేంత వరకు వీరిపై సస్పెన్షన్ కొనసాగుతుందని చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలనే తీర్మానాన్ని మంత్రి బుగ్గన ప్రవేశపెట్టగా, స్పీకర్ ఆమోదించారు. దీంతో, సభలో టీడీపీ తరపున చంద్రబాబు ఒక్కరే మిగిలిపోయారు.