Sensex: దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు

  • 506 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 140 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 5 శాతానికి పైగా పెరిగిన సన్ ఫార్మా షేర్
Sensex ends 506 points high

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు దూసుకుపోయాయి. కరోనా వ్యాక్సిన్ రాబోతోందన్న అంచనాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలపరిచాయి. దీంతో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 506 పాయింట్లు లాభపడి 44,655కి చేరుకుంది. నిఫ్టీ 140 పాయింట్లు పెరిగి 13,109 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
సన్ ఫార్మా (5.73%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (4.82%), టెక్ మహీంద్రా (3.86%), ఓఎన్జీసీ (3.63%), భారతి ఎయిర్ టెల్ (3.39%).

టాప్ లూజర్స్:
కోటక్ మహీంద్రా బ్యాంక్ (-1.39%), నెస్లే ఇండియా (-1.32%), టైటాన్ కంపెనీ (-1.21%), బజాజ్ ఫైనాన్స్ (-1.03%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-0.85%).

More Telugu News