జగన్ ను బొత్స, కన్నబాబు ఏమని విమర్శించారో మా వద్ద ఆధారాలున్నాయి: నారా లోకేశ్

01-12-2020 Tue 14:27
  • మండలిలో మనసులో మాట పుస్తకం రగడ
  • నిన్న లోకేశ్, బొత్స మధ్య వాగ్యుద్ధం
  • ఇవాళ కూడా పేలిన మాటల తూటాలు
Nara Lokesh challenges YSRCP ministers in council sessions

చంద్రబాబు 'మనసులో మాట' అనే పుస్తకంలో వ్యవసాయం దండగ అని పేర్కొన్నారంటూ నిన్న ఏపీ శాసనమండలిలో వైసీపీ మంత్రులు టీడీపీ సభ్యులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ పుస్తకంలోని వ్యాఖ్యలపై లోకేశ్, మంత్రి బొత్స మధ్య వాగ్యుద్ధం కూడా జరిగింది.

ఇవాళ కూడా మండలిలో 'మనసులో మాట' పుస్తకంపై వాడీవేడి వాతావరణం నెలకొంది. వ్యవసాయం దండగ అని చంద్రబాబు ఎక్కడ అన్నారో నిరూపించాలని లోకేశ్ వైసీపీ మంత్రులు కన్నబాబు, అనిల్ కుమార్ లకు సవాల్ విసిరారు. అదేసమయంలో, జగన్ ను బొత్స, కన్నబాబు ఏమని విమర్శించారో తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, మరి చంద్రబాబు వ్యాఖ్యలపై మీ వద్ద ఆధారాలు ఉన్నాయా? అని లోకేశ్ ప్రశ్నించారు.