శివసేన పార్టీలో చేరిన నటి ఊర్మిళ

01-12-2020 Tue 14:08
  • ఊర్మిళను పార్టీలోకి ఆహ్వానించిన ఉద్ధవ్ థాకరే
  • శివసేన కండువా కప్పుకున్న ఊర్మిళ
  • హాజరైన శివసేన నేతలు
Bollywood actress Urmila Matondkar joins Shiv Sena

బాలీవుడ్ నటి ఊర్మిళ మటోండ్కర్ (46) శివసేన పార్టీలో చేరారు. మహారాష్ట్ర సీఎం, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే సమక్షంలో ఊర్మిళ పార్టీ కండువా కప్పుకున్నారు. ఊర్మిళ శివసేనలో చేరుతున్నారంటూ కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. తాను శివసేనలో చేరడంలేదంటూ ఊర్మిళ ప్రకటన చేసినట్టుగానూ కొన్ని కథనాలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో తనపై జరుగుతున్న ప్రచారానికి తెరదించుతూ, ఈ ఉదయం ఊర్మిళ శివసేన సభ్యత్వం తీసుకున్నారు. సీఎం థాకరే నివాసం మాతోశ్రీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఊర్మిళను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి సీఎం ఉద్ధవ్ థాకరే కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు హాజరయ్యారు. ఊర్మిళ గతంలో కాంగ్రెస్ పార్టీలో చేరి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే ఆమె ఓటమిపాలయ్యారు.