గర్భిణి అయినప్పటికీ శీర్షాసనం వేసిన హీరోయిన్ అనుష్క శర్మ.. ఫొటో ఇదిగో!

01-12-2020 Tue 13:37
  • తన భర్త కోహ్లీ సాయం తీసుకున్న అనుష్క
  • యోగా తన జీవితంలో భాగమని వ్యాఖ్య
  • వైద్యుల సలహా తీసుకుని యోగా చేయాలని సూచన
  • శీర్షాసనం అత్యంత కఠినమైన వ్యాయామమని పోస్ట్
anushka sharma pics go viral

ప్రస్తుతం గర్భిణిగా ఉన్న బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్క శర్మ శీర్షాసనం వేసి ఫొటో తీసుకుని పోస్ట్ చేసింది. తాను ఆ ఆసనం వేయడానికి గోడ అండతో పాటు తన భర్త కోహ్లీ సాయం తీసుకున్నానని తెలిపింది. యోగా తన జీవితంలో భాగమని చెప్పింది.

గర్భిణిగా ఉన్న సమయంలో కూడా ఆసనాలు వేయడం సంతోషంగా ఉందని పేర్కొంది. గర్భిణిగా ఉన్నప్పుడు వైద్యుల సూచనలు, సలహాలు పాటించడం తప్పనిసరి అని చెప్పారు. అన్నింటికంటే శీర్షాసనం అత్యంత కఠినమైన వ్యాయామమని తెలిపింది. గర్భం దాల్చక ముందు ఎలాంటి ఆసనాలు వేశానో, ఇప్పుడూ వాటినే వేయవచ్చని తమ డాక్టర్‌ చెప్పారని వివరించింది.

ఇందుకు మన శరీరం కూడా సహకరించాల్సి ఉంటుందని చెప్పింది. తాను ఎన్నో ఏళ్లుగా శీర్షాసనం వేస్తున్నానని చెప్పింది. ఈ ఆసనం వేసేటప్పుడు తనను బ్యాలెన్స్‌ చేయడంతో పాటుగా మరింత సురక్షితంగా ఉండేలా కోహ్లీ చేశాడని తెలిపింది. తన యోగా గురువు ఎఫా ష్రోప్‌ ఆధ్వర్యంలో ఈ ఆసనం వేశానని వివరించింది.