Jagan: జగన్ అనే వ్యక్తి ఓ మాట చెబితే చేస్తాడని ప్రజలు నమ్ముతారు... దటీజ్ జగన్: అసెంబ్లీలో సీఎం జగన్ 

  • విశ్వసనీయత అంశంపై సభలో సీఎం జగన్ వ్యాఖ్యలు
  • ప్రభుత్వం విశ్వసనీయతపైనే నడుస్తోందని వెల్లడి
  • చంద్రబాబు చెప్పింది ఎప్పుడూ చేయడంటూ విమర్శలు
CM Jagan talks about credibility in Assembly sessions

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం అనేది విశ్వసనీయత అనే అంశం ఆధారంగా నడుస్తుందని అన్నారు. తాను ఈరోజు గర్వంగా చెబుతున్నానని, జగన్ అనే వ్యక్తి విశ్వసనీయత ఏ స్థాయిలో ఉందంటే... జగన్ అనే వ్యక్తి ఓ మాట చెబితే చేస్తాడు అని ప్రజలు నమ్ముతారు... దటీజ్ జగన్ అని సీఎం స్పష్టం చేశారు.

అదే చంద్రబాబునాయుడు విశ్వసనీయత గురించి చెప్పుకోవాల్సి వస్తే... చంద్రబాబునాయుడు చెప్పింది ఎప్పుడూ చేయడు అన్నది ఆయన విశ్వసనీయత... దటీజ్ చంద్రబాబునాయుడు గారు అని విమర్శించారు. మనం చేసే పనుల వల్లే విశ్వసనీయత వస్తుందని, 18 నెలలుగా జగన్ అనే వ్యక్తి ఒక తేదీ ఇచ్చి ఆ తేదీన ఇవ్వకుండా పోయిన పరిస్థితి ఎప్పుడైనా వచ్చిందా? అని ప్రశ్నించారు. మేనిఫెస్టోలో చెప్పిన వాటిలో 90 శాతం పూర్తిచేయగలిగాం.... తద్వారా మాట ఇస్తే కట్టుబడి ఉంటాం అనే నమ్మకం ప్రజల్లో కలిగించాం అని సీఎం జగన్ వెల్లడించారు.

More Telugu News