గుర్రపు స్వారీ చేసిన హీరో అఖిల్.. వీడియో ఇదిగో

01-12-2020 Tue 13:19
  • వీడియో పోస్ట్ చేసిన అఖిల్
  • ఉదయాన్నే గుర్రపు స్వారీ చేశానని వ్యాఖ్య
  • తదుపరి సినిమా కోసమే గుర్రపు స్వారీ
akhil video goes viral

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ గుర్రపు స్వారీ చేశాడు. చాలా వేగంగా గుర్రంపై వెళ్తున్న సమయంలో తీసిన వీడియోను ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. దినచర్యను గుర్రపు స్వారీతో ప్రారంభించడం బాగుంటుందని చెప్పాడు. ప్రస్తుతం ఆయన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే.

బొమ్మరిల్లు భాస్కర్  డైరెక్షన్‌లో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాకు గోపీ సుందర్ బాణీలు స‌మ‌కూర్చాడు. వచ్చే ఏడాది జ‌న‌వ‌రిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. తన తదుపరి సినిమా కోసం ఆయన గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో ఆయన గుర్రంపై  కూర్చుని కూడా ఓ ఫొటో తీసుకుని పోస్ట్ చేశాడు.