హిందీలో నయనతార సినిమా రీమేక్.. కథానాయికగా జాన్వీ కపూర్!

01-12-2020 Tue 12:54
  • నయనతార నాయికగా 'కొలమావు కోకిల'
  • హిందీలో రీమేక్ చేస్తున్న ఆనంద్ ఎల్ రాయ్
  • జనవరి 9 నుంచి పంజాబ్ లో షూటింగ్
  • ప్రస్తుతం 'దోస్తానా 2'లో నటిస్తున్న జాన్వీ  
Johnvy Kapor to play Nayanataras role in Hindi

ప్రముఖ నటి దివంగత శ్రీదేవి తనయగా వెండితెరకు పరిచయమై బాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తున్న నటి జాన్వీ కపూర్. ప్రస్తుతం 'దోస్తానా 2' చిత్రంలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా మరో చిత్రానికి ఓకే చెప్పింది. ఇది తమిళంలో విజయం సాధించిన చిత్రానికి రీమేక్ కావడం విశేషం.

ప్రముఖ దక్షిణాది తార నయనతార కథానాయికగా ఆమధ్య 'కొలమావు కోకిల' (తెలుగులో కోకో కోకిల) తమిళ చిత్రం మంచి హిట్టయింది. నయనతార అభినయానికి మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడీ చిత్రాన్ని ఆనంద్ ఎల్ రాయ్ హిందీలో రీమేక్ చేస్తున్నారు. దీనికి సిద్ధార్థ్ సేన్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో కథానాయికగా జాన్వీ కపూర్ ని తీసుకున్నారు.

ఇక ఈ చిత్రం షూటింగును జనవరి 9 నుంచి పంజాబ్ లో నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. సింగిల్ షెడ్యూల్ లోనే మొత్తం చిత్రీకరణను పూర్తిచేయాలని యూనిట్ భావిస్తోంది. మరోపక్క, జాన్వీ తాజాగా నటించిన 'రూహీ అఫ్జా' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.