షూటింగ్ లొకేషన్లో హాయిగా నిద్రపోయిన హీరోయిన్ కీర్తి సురేశ్.. మెల్లిగా సెల్ఫీ దిగిన హీరో నితిన్!

01-12-2020 Tue 12:41
  • తాము చెమ‌ట‌లు కారుస్తుంటే కీర్తి సురేశ్ పడుకుందన్న నితిన్
  • తాను కూడా త‌ప్ప‌కుండా రివేంజ్ తీర్చుకుంటానన్న కీర్తి
  • షూటింగ్ మధ్యలో నిద్రపోకూడదనే పాఠం నేర్చుకున్నానని వ్యాఖ్య 
 keerthy suresh Lesson learnt to never sleep in the middle of the sets

వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటోన్న హీరోయిన్ కీర్తి సురేశ్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఆసక్తికర ఫొటో పోస్ట్ చేసింది. ‌ఆమె నితిన్ స‌ర‌స‌న రంగ్ దే సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. షూటింగ్ సమయంలో ఆమె నిద్రపోయింది. దీంతో మెల్లిగా ఆమె వద్దకు వచ్చిన నితిన్ ఆమెతో సెల్ఫీ తీసుకుని పోస్ట్ చేశాడు.

  తాము ఓపక్క చెమ‌ట‌లు కారుస్తుంటే.. కీర్తి సురేశ్ మాత్రం హాయిగా పడుకుందని నితిన్ ఆ ఫొటోను షేర్ చేస్తూ, కామెంట్ చేశాడు. ఇదే ఫొటోను కీర్తి సురేశ్ కూడా పోస్ట్ చేస్తూ.. తాను కూడా నితిన్, వెంకీ అట్లూరీపై త‌ప్ప‌కుండా రివేంజ్ తీర్చుకుంటానని, అయితే, ఇక  షూటింగ్ మధ్యలో ఎప్పుడూ నిద్రపోకూడదనే పాఠం నేర్చుకున్నానని సరదాగా పేర్కొంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.