సోనూ సూద్ కి పలు ప్రాంతాల్లో పూజలు.. స్పందించిన సోను

01-12-2020 Tue 11:34
  • లాక్‌డౌన్‌లో వలస కూలీలకు సాయపడ్డ సినీనటుడు సోనూసూద్ 
  • అనంతరం కూడా సేవాకార్యక్రమాల కొనసాగింపు
  • గుళ్లు కట్టి పూజలు చేస్తోన్న ప్రజలు
  • తాను అందుకు అర్హుడిని కాదంటూ సోను ట్వీట్  
sonu sood response on his idols in india

కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ వల్ల దేశంలోని పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయి ఎన్నో ఇబ్బందులు పడ్డ వలస కూలీలకు సినీనటుడు సోనూసూద్ సాయం చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయనను రియల్ హీరో, దేవుడు అంటూ చాలా మంది కొనియాడుతున్నారు. ఆయన పేరు దేశ వ్యాప్తంగా మారుమోగిపోతోంది.

లాక్‌డౌన్ తర్వాత కూడా పలువురికి సాయపడి ఆయన అందరితోనూ శభాష్ అనిపించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయ‌న‌కు కొందరు గుళ్లు క‌ట్టి దేవుడిగా పూజిస్తూ హార‌తులు ఇస్తున్నారు. దీనిపై విష్ణు కుమార్ గుప్తా అనే నెటిజన్ ట్వీట్ చేస్తూ పలు ఫొటోలు పోస్ట్ చేశాడు.

ఆయన చేసిన ట్వీట్ కు సోనూసూద్ స్పందించారు. గుళ్లు కట్టి పూజలు చేయడానికి తాను అర్హుడిని కాదంటూ ట్వీట్ చేశారు. ప్ర‌స్తుతం సోనూసూద్ పలు సినిమాల్లో నటిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'ఆచార్య' షూటింగ్ లో పాల్గొన్న ఆయనను చూసేందుకు తాజాగా ప్రజలు భారీగా తరలి వచ్చిన విషయం తెలిసిందే. ఆయనకు దేశంలోని ప్రముఖులు తమ ప్రాంతాల్లో సత్కారాలు కూడా చేస్తున్నారు.