శ్వేత సౌధంలో తమ చివరి క్రిస్మస్ పార్టీకి ముస్తాబు చేస్తున్న మెలానియా... వీడియో ఇదిగో!

01-12-2020 Tue 11:03
  • ఇటీవలి ఎన్నికల్లో ట్రంప్ ఓటమి
  • క్రిస్మస్ సెలబ్రేషన్స్ ను వేడుకగా జరిపేందుకు సిద్ధం
  • 'అమెరికా ది బ్యూటిఫుల్' థీమ్ తో ఉత్సవాలు
Melania Unviels Christmas Decoration of White House

అమెరికా తొలి మహిళ మెలానియా ట్రంప్, వైట్ హౌస్ ను తమ చివరి క్రిస్మస్ పార్టీకి ముస్తాబు చేస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. నవంబర్ లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఓటమిపాలు కాగా, తదుపరి అధ్యక్షుడిగా జో బైడెన్ బాధ్యతలు స్వీకరించనున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ట్రంప్ దంపతులు శ్వేతసౌధంలో నాలుగో క్రిస్మస్ వేడుకలకు సిద్ధమవుతున్నారు. ఇదే వారికి వైట్ హౌస్ లో చివరి క్రిస్మస్ కాగా, ఈ సెలబ్రేషన్స్ ను గ్రాండ్ గా జరిపేందుకు మెలానియా స్వయంగా రంగంలోకి దిగారు.

'అమెరికా ది బ్యూటిఫుల్' థీమ్ తో ఈ సంవత్సరం క్రిస్మస్ వేడుకలను జరుపుతున్నామని తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించిన మెలానియా, అందరమూ కలిసి ఈ సెలబ్రేషన్స్ చేసుకుందామని, తద్వారా ఈ భూమిపై ఉన్నందుకు ప్రతి ఒక్కరమూ గర్వపడుతున్నామన్న సంకేతాలను పంపాలని కోరారు.

ఇక ఈ వేడుకల ఏర్పాట్లను పరిశీలించేందుకు బంగారు వర్ణంలో మెరిసిపోతున్న టాప్, బ్లాక్ గౌన్, హీల్స్ ధరించి, చిరునవ్వులు చిందిస్తూ, వైట్ హౌస్ అలంకరణను ప్రత్యక్షంగా పరిశీలిస్తూ, కొన్ని మార్పు, చేర్పులు చెప్పారు. వైట్ హౌస్ లో అలంకరణ వీడియోను మీరూ చూడవచ్చు.