బీసీసీఐ అంటే క్రికెట్ ఆస్ట్రేలియాకు భయం: చానెల్-7 సంచలన ఆరోపణ

01-12-2020 Tue 10:04
  • బీసీసీఐకి లబ్ధి చేకూరేలా వ్యవహరించిందని ఆరోపణ
  • డే/నైట్ టెస్టులకు బదులు ముందుగా వన్డే సిరీస్ నిర్వహిస్తోందన్న విమర్శ
  • కోర్టు కెక్కిన చానల్ -7
Channel 7 sensational Allegations on Cricket Australia
ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుపై 'చానల్-7' మీడియా సంచలన ఆరోపణలు చేసింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి క్రికెట్ ఆస్ట్రేలియా భయపడుతోందని ఆరోపించింది. తమతో ముందుగా చేసుకున్న ఒప్పందాన్ని కాదని, బీసీసీఐకి లబ్ధి కలిగేలా షెడ్యూల్‌లో మార్పులు చేసిందని విమర్శించింది. అంతేకాదు, సీఏ, బీసీసీఐ మధ్య ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాయో తెలుసుకునే అవకాశం తమకు ఇవ్వాలని కోరుతూ కోర్టుకెక్కింది. నిజానికి భారత పర్యటనను డే/నైట్ టెస్టుతో ఆరంభించాల్సి ఉండగా,  దానిని డిసెంబరు 17కు వాయిదా వేసిందని పేర్కొంది. వన్డే, టీ20లను ముందుగా నిర్వహిస్తోందని సెవన్ వెస్ట్ మీడియా సీఈవో వార్‌బర్టన్ పేర్కొన్నారు.