విమానంలోనే వ్యభిచారం.. ఎయిర్‌హోస్టెస్ సోషల్ మీడియా ప్రచారం!

01-12-2020 Tue 09:03
  • కలకలం రేపిన సోషల్ మీడియా ప్రచారం
  • లోదుస్తులను కూడా విక్రయించనున్నట్టు పేర్కొన్న ఎయిర్‌హోస్టెస్
  • విచారణకు ఆదేశించిన బ్రిటిష్ ఎయిర్‌వేస్
British Airways stewardess is selling sex between flights

డబ్బులిస్తే విమానంలోనే శృంగారానికి రెడీ అంటూ ఓ ఎయిర్‌హోస్టెస్ సోషల్ మీడియా వేదికగా చేస్తున్న ప్రచారం కలకలం రేపింది. విమానంలో అభ్యంతరకరంగా తీసుకున్న ఫొటోలను కూడా పోస్టు చేసింది. బ్రిటిష్ ఎయిర్‌వేస్‌కు చెందిన ఎయిర్‌హోస్టెస్.. విమానంలో శృంగారాన్ని కోరుకునేవారు తనకు కొంత డబ్బు చెల్లిస్తే చాలని, కోరుకున్న విధంగా గడపొచ్చని ఆఫర్ ఇచ్చింది.

అంతేకాదు, తన లోదుస్తులను కూడా విక్రయిస్తానని, ఒక్కో దానిని రూ. 2,500కు కొనుగోలు చేసుకోవచ్చని తెలిపింది. ఆమె పోస్టులు వైరల్ కావడంతో అప్రమత్తమైన బ్రిటిష్ ఎయిర్‌వేస్ సదరు ఎయిర్‌హోస్టెస్‌పై విచారణకు ఆదేశించింది. ఈ సందర్భంగా విమానయాన సంస్థ అధికారులు మాట్లాడుతూ.. తమ ఉద్యోగుల నుంచి అన్ని వేళలా అత్యున్నత స్థాయి ప్రవర్తనను ఆశిస్తున్నట్టు చెప్పారు. కాగా, విషయం తెలిసిన ఎయిర్‌హోస్టెస్ ఆదివారం కొన్ని పోస్టులు, ఫొటోలను తొలగించింది.