Hyderabad: ఏడాది గరిష్ఠానికి పెట్రోలు, డీజిల్ ధర!

  • హైదరాబాద్ లో రూ.85.64కు లీటరు పెట్రోలు
  • గత పది రోజులుగా పెరుగుతూనే ఉన్న ధర
  • పన్నులను సవరించని ప్రభుత్వాలు
Petrol and Diesel Price are One Year Hign

ఇండియాలో పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదల కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా వరుసగా ధరలు పెరుగుతూ వస్తుండటంతో లీటరు ఇంధన ధరలు ఏడాది గరిష్ఠానికి చేరుకున్నాయి. సోమవారం నాడు హైదరాబాద్ లో లీటరు పెట్రోలు ధర రూ. 85.64కు చేరగా, డీజిల్ ధర రూ.79.02కు చేరింది. గడచిన పది రోజులుగా ఏ రోజూ ధర తగ్గకపోవడం గమనార్హం.

ఇక, ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగానే తాము ధరలను సవరించాల్సి వస్తోందని చమురు కంపెనీలు అంటున్నాయి. ఇదే సమయంలో ముడి చమురు ధరలు తగ్గినప్పుడు ప్రభుత్వాలు పన్నులను పెంచుతూ, వాహనదారులకు ఉపశనమం కలిగించడం లేదన్న ఆరోపణలూ వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం పెట్రోలు ధరలో 63 శాతం, డీజిల్ ధరలో 60 శాతం పన్నుల రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వెళుతోంది. ఇదిలావుండగా, భోపాల్ లో లీటరు పెట్రోలు ధర రూ. 90ని దాటగా, డీజిల్ ధర రూ. 80ని అధిగమించడం గమనార్హం.

More Telugu News