బండి సంజయ్ వాహనాన్ని అడ్డుకున్న టీఆర్ఎస్ నేతలు... హిమాయత్ నగర్ లో ఉద్రిక్తత

30-11-2020 Mon 21:40
  • మినర్వా హోటల్ కు సమీపంలో ఘటన
  • ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు
  • కావాలనే దాడికి యత్నించారన్న బండి సంజయ్
TRS leaders attack on Bandi Sanjay vehicle

మరికొన్ని గంటల్లో జీహెచ్ఎంసీ పోలింగ్ షురూ కానున్న నేపథ్యంలో హైదరాబాద్ హిమాయత్ నగర్ లో ఉద్రిక్తత ఏర్పడింది. ఇక్కడి మినర్వా హోటల్ కు సమీపంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ వాహనాన్ని టీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. వెంటనే పోలీసులు వచ్చి సంజయ్ ను అక్కడ్నించి పంపించి వేశారు. అక్కడ మోహరించిన ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ సందర్భంగా  ఓ వాహనం ధ్వంసం అయింది. కాగా, బండి సంజయ్ వాహనాన్ని అడ్డుకున్నది ఖైరతాబాద్ టీఆర్ఎస్ నేత విజయారెడ్డి, ఆమె అనుచరులు అని తెలిసింది. దీనిపై బండి సంజయ్ స్పందిస్తూ, టీఆర్ఎస్ నేతలు ఉద్దేశపూర్వకంగానే తనపై దాడికి ప్రయత్నించారని ఆరోపించారు.