నాగశౌర్య కొత్త చిత్రం 'లక్ష్య'.. టైటిల్ లోగో పోస్టర్ విడుదల

30-11-2020 Mon 21:37
  • 'వరుడు కావలెను'లో నటిస్తున్న నాగశౌర్య 
  • సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో 'లక్ష్య'
  • ప్రాచీన విలువిద్య నేపథ్యంలో సాగే కథ 
  • కేతిక శర్మ హీరోయిన్..కీలక పాత్రలో జగపతి   
Naga shourya new film titled Lakshya

యంగ్ హీరో నాగశౌర్య వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం 'వరుడు కావలెను' సినిమాలో నటిస్తున్న ఈ యువ కథానాయకుడు, దీని తర్వాత సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. ఇది నాగశౌర్య నటిస్తున్న ఇరవయ్యవ సినిమా. ప్రాచీన విలువిద్య నేపథ్యంలో ఈ చిత్రం రూపొందనుంది.  

ఇక ఈ చిత్రానికి 'లక్ష్య' అనే టైటిల్ని నిర్ణయించారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ చిత్ర నిర్మాతలు ఈ రోజు టైటిల్ లోగోతో కూడిన ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో నాగశౌర్య మంచి బాడీ ఫిట్ నెస్ తో స్టయిలిష్ గా వున్నాడు. ఈ సినిమా కోసమే ఆమధ్య ఎయిట్ ప్యాక్ బాడీతో ధనుస్సు ఎక్కుపెడుతూ ఇచ్చిన పోజులు అందర్నీ ఆకట్టుకున్నాయి. తాజా పోస్టర్ కూడా అభిమానుల్ని అలరించేలా వుంది.

ఈ 'లక్ష్య' చిత్రంలో కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ప్రముఖ నటుడు జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. త్వరలో ఇది సెట్స్ కి వెళ్లనుంది.