సినిమాల్లో మళ్లీ నటించడంపై సమీరారెడ్డి స్పందన

30-11-2020 Mon 21:02
  • పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమైన సమీర
  • సినిమాల్లో నటించాలనే ఆసక్తి లేదన్న సమీర
  • టీవీ షోలో నటించబోతోందంటూ వార్తలు
Sameera Reddys response on re entry

కొంత కాలం క్రితం వరకు స్టార్ హీరోయిన్ గా కొనసాగిన సమీరా రెడ్డి పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిలైపోయిన సంగతి తెలిసిందే. పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె పూర్తిగా తన కుటుంబానికే పరిమితమైంది. తాజాగా ఆమె మళ్లీ నటించబోతోందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన సమీర త్వరలోనే రీఎంట్రీ ఇవ్వబోతోందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై ఆమె క్లారిటీ ఇచ్చింది.

తనకు సినిమాలలో నటించాలనే ఆసక్తి లేదని సమీర స్పష్టం చేసింది. సమీర ఈ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత... మళ్లీ మరొక వార్త వైరల్ అవుతోంది. ఓ జాతీయ ఛానల్ లో ప్రసారం కానున్న ఒక షోకి ఆమె హోస్ట్ గా వ్యవహరించబోతోందనేది ఆ వార్త. బాలీవుడ్ మీడియా కూడా ఈ అంశంపై కథనాలను ఇస్తోంది. ఈ వార్తలపై సమీర ఇంకా స్పందించాల్సి ఉంది.