Nandyal: సలాం హత్య కేసు.. సీఐ, హెడ్ కానిస్టేబుల్ బెయిల్ రద్దు చేసిన కోర్టు

Court cancels bail to CI and Head Constable in Abdul Salam case
  • కుటుంబంతో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన సలాం
  • సీఐ, హెడ్ కానిస్టేబుల్ పై కేసు
  • ఇద్దరినీ కోర్టులో ప్రవేశపెట్టాలని ఆదేశించిన కోర్టు
కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన అబ్దుల్ సలాం తన కుటుంబంతో కలసి సామూహిక ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులైన సీఐ సోమశేఖరరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ లు ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు. అయితే నంద్యాల మూడో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు ఈరోజు కీలక ఆదేశాలను జారీ చేసింది. 306 సెక్షన్ ను అదనంగా చేర్చి, బెయిల్ ను రద్దు చేసింది. ముద్దాయిలిద్దరినీ నంద్యాల కోర్టులో హాజరుపరచాలని న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు. మరోపక్క, నిందితుల బెయిల్ రద్దు కావటం పట్ల స్థానిక ముస్లిం సంఘాలు, ప్రజా సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Nandyal
Abdul Salam

More Telugu News