హైదరాబాదులో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని స్రవంతి ఆత్మహత్య

30-11-2020 Mon 19:32
  • మియాపూర్ పీఎస్ పరిధిలో ఘటన
  • మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించిన పోలీసులు
  • కేసు నమోదు
Software employ Sravanthi commits suicide

హైదరాబాదులో స్రవంతి అనే ఐటీ ఉద్యోగిని బలవన్మరణానికి పాల్పడింది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. స్రవంతి తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబపరమైన కారణాలతోనే సాఫ్ట్ వేర్ ఉద్యోగిని తనువు చాలించి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. స్రవంతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

స్రవంతి భర్త రవికిరణ్ కూడా సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్రవంతి, రవికిరణ్ మియాపూర్ పరిధిలోని గోపాల్ నగర్ లో నివసిస్తున్నారు. ఇద్దరి మధ్య గొడవలేమైనా ఉన్నాయా? అన్న కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు.