'ఆచార్య' సెట్ లో సోనూ సూద్ అభిమానుల సందడి

30-11-2020 Mon 16:02
  • ఆచార్య సినిమాలో నటిస్తున్న సోనూ సూద్
  • హైదరాబాదులో షూటింగ్ జరుపుకుంటున్న ఆచార్య
  • సోనూ వచ్చినట్టు తెలియడంతో పోటెత్తిన అభిమానులు
Fans rushed to Acharya sets to meet Sonu Sood

లాక్ డౌన్ వేళ తన సహాయ కార్యక్రమాలతో రియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సోనూ సూద్ ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. తాజాగా ఆయన ఆచార్య సెట్ కు వచ్చారని తెలుసుకున్న అభిమానులు అక్కడికి కూడా పోటెత్తారు. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఆచార్య చిత్రం ప్రస్తుతం హైదరాబాదులో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో సోనూ సూద్ కూడా ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు.

అయితే సోనూ సూద్ హైదరాబాద్ కు వచ్చిన నేపథ్యంలో ఆయనను చూసేందుకు అభిమానులు భారీ ఎత్తున సెట్స్ వద్దకు తరలివచ్చారు. కారవాన్ లో విశ్రాంతి తీసుకుంటున్న సోనూ సూద్... వాహనం నుంచి వెలుపలికి వచ్చి ఫ్యాన్స్ కు అభివాదం చేశారు. సోనూను చూడగానే అక్కడున్నవారందరూ హర్షం వ్యక్తం చేశారు. తమ ఫోన్లలో సెల్ఫీలు, వీడియోలు తీసుకున్నారు. ఈ సందర్భంగా, నిస్సహాయ స్థితిలో ఉన్న ఓ కుటుంబంతో సోనూ ప్రత్యేకంగా మాట్లాడినట్టు తెలుస్తోంది.