డబ్బుకు, ప్రలోభాలకు లోనుకాకండి: ఓటర్లకు కేఏ పాల్ విజ్ఞప్తి

30-11-2020 Mon 15:16
  • రేపు జరగనున్న గ్రేటర్ ఎన్నికలు
  • ప్రతి ఒక్కరూ ఓటు వేయాలన్న కేఏ పాల్
  • ఈ ఎన్నికల ద్వారా మార్పును  తీసుకొద్దామన్న పాల్
KA paul urges voters to utilise their right in GHMC elections

జీహెచ్ఎంసీ ఎన్నికలు రేపు జరగబోతున్నాయి. ఎన్నికల సందర్భంగా ప్రధాన పార్టీలన్నీ ప్రచారంతో హోరెత్తించాయి. నాయకుల మధ్య మాటల తూటాలు పేలాయి. మరోవైపు ఈ ఎన్నికలను ఉద్దేశించి కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పారు. డబ్బుకు, ప్రలోభాలకు లోనుకావద్దని సూచించారు. ఈ ఎన్నికల ద్వారా మార్పును తీసుకొద్దామని పిలుపునిచ్చారు.

మరోవైపు ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సారి పోలింగ్ ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ పత్రాల ద్వారా జరుగుతోంది. ఎన్నికలను కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించనున్నారు. కరోనా నేపథ్యంలో పోలింగ్ బూత్ ల సంఖ్యను కూడా పెంచారు.