విద్యాబాలన్ షూటింగును అడ్డుకున్నారంటూ మధ్యప్రదేశ్ మంత్రిపై ఆరోపణలు.. ఖండించిన మంత్రి

30-11-2020 Mon 14:32
  • మధ్యప్రదేశ్ లో విద్యాబాలన్ సినిమా షూటింగ్
  • విద్యాబాలన్ ను ను డిన్నర్ కు ఆహ్వానించిన మంత్రి
  • డిన్నర్ కు వెళ్లని విద్యాబాలన్
I didnt invite Vidyabalan to dinner says minister Vijay Shah

మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా వివాదంలో చిక్కున్నారు. ఓ బాలీవుడ్ సినిమా షూటింగ్ ను అడ్డుకున్నారనే ఆరోపణలు ఆయనపై వస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే, సినీ నటి విద్యాబాలన్ నటిస్తున్న 'షేర్నీ' సినిమా షూటింగ్ మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్ లో జరుగుతోంది. షూటింగ్ కోసం వచ్చిన విద్యాబాలన్ ని విజయ్ షా డిన్నర్ కు పిలిచారట. అయితే డిన్నర్ కు వెళ్లడానికి విద్య సుముఖత వ్యక్తం చేయలేదనీ, దీంతో, షూటింగ్ కు అనుమతి ఇవ్వకుండా చిత్ర యూనిట్ ను మంత్రి ఇబ్బంది పెట్టారని ఓ ఈ వార్త సంచలనంగా మారింది.

దీనిపై విజయ్ షా మాట్లాడుతూ, బాలాఘాట్ లో షూటింగ్ జరుపుకునేందుకు యూనిట్ సభ్యులు అనుమతి తీసుకున్నారని చెప్పారు. తనను డిన్నర్ కు రావాలని వారు ఆహ్వానించారని... అయితే తనకు ఇప్పుడు సాధ్యం కాదని, తర్వాత వస్తానని చెప్పానని అన్నారు. సినిమా షూటింగ్ ఆగిపోలేదని చెప్పారు. సినిమా వాహనాలకు అటవీ అధికారులు అనుమతి నిరాకరించారనే వార్తల్లో వాస్తవం లేదని అన్నారు.