కొరియోగ్రాఫర్ దర్శకత్వంలో పవన్ హీరోగా సినిమా?

30-11-2020 Mon 13:56
  • ప్రస్తుతం తండ్రితో సినిమాలు నిర్మిస్తున్న చరణ్ 
  • బాబాయ్ పవన్ హీరోగా ఓ భారీ ప్రాజక్ట్ ప్లానింగ్
  • జానీ మాస్టర్ చెప్పిన కథకు ఓకే చెప్పిన పవన్
  • చరణ్ కు కూడా నచ్చిన జానీ మాస్టర్ కథ
Dance Master to direct Pawan Kalyan

హీరో రామ్ చరణ్ అటు సినిమాలలో నటిస్తూనే.. ఇటు ప్రొడక్షన్ హౌస్ ని కూడా నెలకొల్పి మరోపక్క సినిమాలను కూడా నిర్మిస్తున్నాడు. ముఖ్యంగా తండ్రి మెగాస్టార్ చిరంజీవితో భారీ చిత్రాలను నిర్మిస్తున్నాడు. ఈ క్రమంలో మరో భారీ చిత్రనిర్మాణానికి చరణ్ ఉపక్రమిస్తున్నట్టు తెలుస్తోంది. తన బాబాయ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించడానికి ఆయన ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

పవన్ కల్యాణ్ తో ఓ సినిమా రూపొందించాలని ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గత కొంత కాలంగా ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన ఓ కథను తయారుచేసుకుని, ఇటీవల పవన్ ను కలిసినట్టు, పవన్ కి ఆ కథ నచ్చినట్టు చెబుతున్నారు. దీంతో జానీ మాస్టర్ ను 'ప్రొసీడ్' అవమని పవన్ చెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

ఆ తర్వాత ఆయన చరణ్ ను కలసి ఆ కథను వివరించినట్టు, ఆయన కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ దర్శకత్వంలో బాబాయ్ హీరోగా చరణ్ సినిమా నిర్మించడం దాదాపు ఓకే అయినట్టుగా టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది.