సీబీఐ, ఈడీలను దేశ సరిహద్దులకు పంపాలి: శివసేన

30-11-2020 Mon 13:31
  • విపక్షాలను కట్టడి చేసేందుకు సీబీఐ, ఈడీలను బీజేపీ వాడుకుంటోంది
  • సరిహద్లుల్లో ఉగ్రవాదులు చొరబడుతున్నారు
  • బోర్డర్ లో పరిస్థితిని చక్కదిద్దడానికి సీబీఐ, ఈడీలను అక్కడకు పంపాలి
CBI and ED should be sent to boarders says Shivsena

బీజేపీ, సీబీఐలపై శివసేన అధికారిక పత్రిక సామ్నా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ రెండింటినీ ఉగ్రవాదులతో పోరాడేందుకు దేశ సరిహద్దులకు పంపాలని తన కథనంలో పేర్కొంది. ఢిల్లీలో నిరసనన కార్యక్రమాలను చేపట్టిన రైతులను ఉగ్రవాదులు అంటున్నారని... వారిపై జల ఫిరంగులను ఉపయోగిస్తున్నారని మండిపడింది. ఢిల్లీలో అత్యంత చలి వాతావరణం ఉన్న సమయంలో రైతులపై నీటిని చిమ్మడం అమానుషమని వ్యాఖ్యానించింది.

విపక్షాలను నిలువరించేందుకు కేంద్ర వ్యవస్థలైన సీబీఐ, ఈడీలను బీజేపీ వాడుకుంటోందని శివసేన మండిపడింది. వారి ధైర్యసాహసాలు ఏమిటో నిరూపించుకునే అవకాశం సీబీఐ, ఈడీలకు ఇవ్వాలని... దేశ సరిహద్దులకు పంపించి, వారి సత్తాను నిరూపించుకునే అవకాశాన్ని కల్పించాలని చెప్పింది. ప్రతిసారి బుల్లెట్లు మాత్రమే పని చేయవని వ్యాఖ్యానించింది. దేశ సరిహద్దుల్లో ఉగ్రవాదులు చొరబడుతున్నారని... వారిని వదిలేసి ఢిల్లీ సరిహద్దుల వద్ద ఉన్న మన రైతులను టెర్రరిస్టులు అంటున్నారని మండిపడ్డారు. సీబీఐ, ఈడీలను బోర్డర్ కు పంపించాలని, అక్కడి పరిస్థితిని చక్కదిద్దే అవకాశం వారికి కల్పించాలని అన్నారు.