రాజకీయ ప్రవేశంపై ప్రకటన చేస్తాను!: భేటీ తర్వాత రజనీకాంత్

30-11-2020 Mon 13:19
  • తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడిన రజనీ
  • ఆర్ఎంఎం కార్యదర్శులతో నా అభిప్రాయాలను పంచుకున్నా
  • పలు సమస్యల గురించి తెలిపారు
will announce about political entry

ఆర్‌ఎంఎం (రజనీ మక్కల్ మండ్రం) సభ్యులతో సినీనటుడు రజనీకాంత్ ఈ రోజు సమావేశమై చర్చించిన విషయం తెలిసిందే. చెన్నైలోని రాఘవేంద్ర ఫంక్షన్ హాల్‌లో కొనసాగిన ఆ సమావేశం ముగిసింది.  క్రియాశీల రాజకీయాల్లోకి ఆయన ప్రవేశంపై ఇప్పటికీ సందిగ్ధత తొలగలేదు. రాజకీయ పార్టీపై ఆయన నుంచి ప్రకటన రాలేదు. రజనీ మక్కల్ మండ్రంతో చర్చలు ముగిసిన అనంతరం రజనీ నేరుగా పోయెస్ గార్డెన్ లోని తన నివాసానికి వెళ్లారు.

అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రజనీ మాట్లాడుతూ... ఆర్ఎంఎం కార్యదర్శులతో తన అభిప్రాయాలను పంచుకున్నానని తెలిపారు. ఆర్ఎంఎం  కార్యదర్శులు, నిర్వాహకులు పలు సమస్యల గురించి తెలిపారని వివరించారు. రాజకీయ రంగ ప్రవేశంపై వీలైనంత త్వరగా నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పారు. కాగా, ఆయన ఇంటి వద్దకు భారీగా అభిమానులు చేరుకున్నారు. వారికి రజనీకాంత్ అభివాదం చేశారు.