నాటి కోడికత్తి దాడికి, ఈనాటి తాపీ దాడికి సారూప్యం కనిపిస్తోంది: వర్ల రామయ్య

30-11-2020 Mon 13:19
  • మచిలీపట్నంలో మంత్రి పేర్ని నానిపై దాడికి యత్నం
  • ట్విట్టర్ లో స్పందించిన వర్ల రామయ్య
  • దర్యాప్తు చేసి నిజాలు వెలికితీస్తారా? అంటూ వ్యాఖ్యలు
Varla Ramaiah responds over the attack on Perni Nani

ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నానిపై మచిలీపట్నంలో ఓ వ్యక్తి తాపీతో దాడికి యత్నించిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య స్పందించారు. నాటి కోడికత్తి దాడికి, ఈనాటి తాపీ దాడికి సారూప్యమున్నట్టుగా అనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. ఆనాటి బాధితుడు ముఖ్యమంత్రి అయితే, ఈనాడు రవాణా మంత్రి బాధితుడయ్యాడని వివరించారు. ఆనాడు కోడికత్తితో చంపాలనుకుంటే, ఈనాడు తాపీతో చంపాలనుకున్నాడని పేర్కొన్నారు. ఈ ఆయుధాలతో కదలకుండా పడుకున్న మనిషిని మాత్రమే చంపగలమని వర్ల రామయ్య స్పష్టం చేశారు. దర్యాప్తు చేసి నిజాలు వెలికితీస్తారా? అంటూ ట్వీట్ చేశారు.